హరప్పన్ సిటీ అఫ్ ధోలవిరా
- సింధు నాగరికతకు చెందిన ప్రజలు కచ్ ఎడారిలో ఒక ఆధునిక నగరాన్ని అభివృద్ధి చేసారు.
- వ్యాపార వర్గాలకు అంతర్జాతీయ port గా ధోలవీరా అత్యంత ముఖ్యమైన నగరంగా ఉండేది.
- ఈ స్థలాన్ని 1967-1968 లో భారత పురాతత్వ సర్వే సంస్థ యొక్క అప్పటి డైరెక్టరు జనరల్ జె.పి.జోషి కనుగొన్నారు.
- ఇది అతి పెద్దవైన హరప్పా క్షేత్రాల్లో ఐదవది.
- 1990 నుండి పురాతత్వ సర్వే సంస్థ ఇక్కడ తవ్వకాలు జరిపింది
- 1990 2005 మధ్య 13 తవ్వకాలు జరిపింది.
- ఈ తవ్వకాలలో పట్టణ ప్రణాళిక, వాస్తు రీతులు, వెలుగులోకి వచ్చాయి.
- అనేక ముద్రలు, పూసలు, జంతువుల ఎముకలు, బంగారం, వెండి, మట్టి ఆభరణాలు, మట్టి కుండలు, కంచు పాత్రలు లభించాయి.
- పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ధోలావీరా దక్షిణ గుజరాత్, సింధ్, పంజాబు, పశ్చిమాసియాల్లోని జనావాసాల మధ్య ప్రధాన వర్తక కేంద్రంగా ఉండేదని తెలుస్తుంది.
- సింధు లోయ స్థలాలు దాదాపు అన్నిటిలోనూ - హరప్పా, మొహెంజో దారోలతో సహా - నిర్మాణాలన్నీ ఇటుకలతో కట్టారు
- కానీ ఈ ధోలావీర మాత్రం పూర్తిగా రాళ్లతో నిర్మితం అయి ఉండటం విశేషం
- ఈ పట్టణం లో ఒక కోట, మధ్య పట్టణం మరియు దిగువ పట్టనాలు ఉండేటివి.
- కోట, మధ్య పట్టణం రెంటికీ కూడా స్వంతంగా రక్షణ నిర్మాణాలు, ద్వారాలు, వీధులు, బావులు, విశాలమైన బహిరంగ స్థలాలూ ఉన్నాయి.
- పట్టణపు నైఋతి భాగం దాదాపు అంతటా విస్తరించి ఉన్న కోట, పటిష్ఠంగా నిర్మితమై ఉండేది.
- ఈ ధోలవీరా నగరం రెండు వాగుల మధ్య ఏర్పాటైంది.
- ఉత్తరాన మన్సర్, దక్షిణాన మన్హర్ వాగులు ఉన్నాయి.
- ఈ వాగులలో కేవలం వర్షాకాలంలో మాత్రమే నీరు ఉండేది.
- అయితే ధోలవీరా ప్రజలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఈ రెండు వాగులకు ఆనకట్టలు నిర్మించి నీటిని రిజర్వాయిర్లకు మళ్లించారు.
- అలా నగరం చుట్టూ ఉన్న రిజర్వాయిర్లలో, భూ గర్భ భావులలో నీటిని నిల్వచేసారు .
- ఎంతలా అంటే వర్షం పాడకపోయినా ఒక సంవత్సర కలం వరకు నీటి ఇబ్బందులను ఎదుర్కొనేలా వీటిని నిర్మించారు.
- నగరం చుట్టూ రిజర్వాయర్ లు, భూ గర్భ వావులు, స్నానపు కొలనులు లాంటివి వారు ఆకాలంలోనే నిర్మించారంటే అప్పటి సివిలైజషన్ ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవచ్చు.
- ధోలావీరలో పురావస్తు శాస్తవేత్తలు కనిపెట్టిన వాటిలో ఆసక్తి కరమైనది ఒక Sign board ఆకారంలో ఉన్న ఒక వస్తువు.
- ఇదీ 10 అక్షరాలతో ఉన్నదీ .
- ఆ sign board లో ఉన్న అక్షరాలను ఇప్పటివరకు ఎవరు కూడా crack చేయలేకపోయారు.
- అదొక sign board అయ్యి ఉండొచ్చనేది కూడా పూర్తిగా వాస్తవమైనది కాదు.
- ఈ ధోలవిరా ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లలో ఉన్నదీ.
- సింధు లోయ నాగరికతలో ఒకభాగమైన ఆ చోటు అప్పటి పెద్ద పెద్ద నగరాలలో ఒకటిగా ఉండేది.
- పురావస్తు శాస్తవేతల ప్రకారం ఆ నగరం 120ఎకరాలలో విస్తరించి ఉన్నదని తెలుస్తుంది.
- సుమారుగా ఈ నగరం 5000 ఏండ్ల క్రితమే నిర్మించారని తెలుస్తుంది.
- అంటే ఈజిప్టు లూనీ పిరమిడ్స్ నిర్మాణానికి ముందే ఎక్కడ ఒక అధునాతమైన నగరం ఉండేదని తెలుస్తుంది.
- వాళ్లకి అప్పట్లోనే civil engineering గురించి, జియాలోజి మరియు హైడ్రొలోజి గురించి వాళ్లకు తెలుసనీ ఈ నగరాన్ని చూస్తే అర్ధం అవుతుంది
- హరప్పన్లు మాట్లాడిన భాష గురించి తెలియదు.
- వారి లిపిని ఇంతవరకూ చదవలేకపోయారు.
- దానిలో 400 ప్రాథమిక గుర్తులు అనేక రూపాల్లో ఉన్నాయని భావిస్తున్నారు.
- ఈ గుర్తులు పదాలను, పద బంధాలనూ కూడా సూచిస్తూ ఉండవచ్చు.
- రాత కుడి నుండి ఎడమకు రాసేవారు.
- శాసనాలు ఎక్కువగా ముద్రల మీద (రాతిలో) చిరు ముద్రికల (మట్టిపై ముద్రికలను వత్తగా ఏర్పడిన ఆకృతి) మీదా ఉన్నాయి.
- కొన్ని శాసనాలను రాగి పలకల మీద, కంచు పాత్రలు, మట్టి, రాయి, పింగాణితో చేసిన చిన్న చిన్న వస్తువులు కూడా ఉన్నాయి.
- ఈ ముద్రలను వాణిజ్యానికి, అధికారిక కార్యకలాపాల కోసం కూడా వాడి ఉండవచ్చు.
Comments
Post a Comment